విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవకాశవాదం: టిడిపి, సిపిఐలపై గుర్రుమన్న రాఘవులు

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
విజయవాడ: పాత మిత్రపక్షం తెలుగుదేశంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు గుర్రుమన్నారు. తెలుగుదేశం, సిపిఐలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్సించారు. తాము అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉంటామని ఆయన చెప్పారు.

గతంలో నీరు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన పార్టీలో ఇప్పుడు నీరు విడుదల చేయాలంటూ ఆందోళన చేయడం సరి కాదని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీన విద్యుత్ అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతామని ఆయన చెప్పారు. సెప్టెంబర్ మొదటివారంలో రాష్ట్రవ్యాప్తంగా హర్తాళ్ చేస్తామని ఆయన చెప్పారు.

కృష్ణా నది నుంచి డెల్టాకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం, సిపిఐ శనివారం కృష్ణా బ్యారేజీ వద్ద మహా ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఈ ధర్నాను ఉద్దేశించే రాఘవులు వ్యాఖ్యలు చేశారు. నాగార్జునసాగర్ ‌నుంచి నీటిని విడుదల చేయడాన్ని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు విమర్శించారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో ఉందని రాఘవులు అన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తక్షణమే ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
CPM state secretary BV Raghavulu lashed out at Telugudesam and CPI. He said that the parties following double standards on Krishna water release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X