కసబ్‌తో పాటు కిరణ్‌నూ ఉరితీయాలి: దాడి

Dadi Veerabhadra Rao
హైదరాబాద్: ముంబయి ఘటనల నిందితుడు, ఉగ్రవాది అజ్మల్ కసబ్‌తో పాటు మన రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఉరి తీయాలని తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర రావు బుధవారం మండిపడ్డారు. ఎంసెట్ జరిగి మూడున్నర నెలలైందని, ఇంతవరకూ అడ్మిషన్ల వ్యవహారం తేల్చరని, మంచి మార్కులు వచ్చిన విద్యార్థుల తల్లితండ్రులకు ఏడుపొక్కటే తక్కువ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటలు బాగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి విద్యార్థులతో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ప్రేక్షకుల్లా చూడాల్సి వస్తోందని, ఏఎఫ్ఆర్‌సీ ఏడాది పొడవునా అన్ని కళాశాలలకు తిరిగి అక్కడి సౌకర్యాలు, ఇతర అంశాలపై పరిశీలన జరపాలని, కానీ ఆ పని చేయట్లేదన్నారు. మంత్రుల కమిటీ కోర్టులా తీర్పులు ఇస్తోందన్నారు. ముడుపుల కోసం కళాశాలలను ప్రభుత్వ పెద్దలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, దాని కోసమే హడావుడిగా ఆర్డినెన్స్ తెచ్చారని దాడి విమర్శించారు.

కాగా రాష్ట్రంలో రైతులకు క్రాప్ హాలిడే.. పరిశ్రమలకు పవర్‌హాలిడే.. తాగడానికి నీరు లేక వాటర్‌హాలిడే.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఏ హాలిడే లేకుండా నిరంతరంగా కుంభకోణాలు, అవినీతి అక్రమాలు కొనసాగిపోతూనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉంటుందని తెలిసికూడా ముందుచూపు లేకుండా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించింది.

విద్యుత్ సమస్యలను పరిష్కరించని ప్రభుత్వ అసమర్థ పాలనకు నిరసనగా టిడిపి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆందోళన, చలో సెక్రటరియేట్ ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇందిరా పార్క్ నుంచి మధ్యాహ్నం సచివాలయాన్ని ముట్టడించేందుకు బయల్దేరిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట నెలకొంది. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, మహేందర్‌రెడ్డి, రాములు, సత్యావతి రాథోడ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, గోపాల్ కృష్ణ తదితరులతో పాటు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్‌లు, టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+