నిన్న నిత్యానంద.. ఇప్పుడు అవినీతి: ఫ్లెక్సీ ఏర్పాటు

అప్పుడు ఆహా ఆంధ్ర ప్రదేశ్.. ఇప్పుడు అయ్యయ్యో ఆంధ్ర ప్రదేశ్ అని ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అవినీతితో ఎపి గగ్గోలు పెడుతోందని, సాగునీటి కోసం రైతులు, తాగునీటి కోసం ప్రజలు, ఎమ్మార్పీ కోసం మందుబాబులు, విద్యుత్ కోసం మహిళలు, బెయిల్ కోసం అక్రమార్కులు.. ఇలా రాష్ట్రంలోని ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారని మూన్ సేన ఆ ఫ్లెక్సీలో పేర్కొంది.
కాగా గతంలో పలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవినీతికి, సినీ నటి రంజితతో రాసలీలల కేసులో ఇరుక్కున్న నిత్యానంద స్వామికి లింక్ పెట్టి ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో అటు వైపు వెళ్లే వారి అందరి దృష్టిని అది అప్పుడు ఆకర్షించింది. నిత్యానంద స్వామికి, అవినీతికి లింక్ పెడుతూ గుంటూరులో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిని కూడా అప్పుడు ది మూన్ సేన పేరుతో దీనిని ఏర్పాటు చేశారు.
అందులో నిత్యానందకు వెటకారపు వ్యాఖ్యల ద్వారా స్వాగతం పలికారు. ఆయనకు వెటకారంగా స్వాగతం పలుకుతూనే రాష్ట్రంలోని అవినీతిపై కూడా ఎద్దేవా చేశారు. ఆ ప్లెక్సీలో.. తమిళనాడు, కర్నాటకలలో ఛీత్కారాలతో సతమతమవుతున్న నిత్యానంద స్వామికి సాదర స్వాగతం.. నేటి మా ఎపి అక్రమార్కులకు, అవినీతిపరులకు అండగా ఇక్కడి క్రింది స్థాయి న్యాయవ్యవస్థ వరకు జీతాలు తీసుకుంటున్న వారు అవినీతికి పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications