బల్క్ ఎస్సెమ్మెస్‌లు, ఎమ్మెమ్మెస్‌లపై నిషేధం ఎత్తివేత

ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఎస్సెమ్మెస్‌లపై, ఎమ్మెమ్మెస్‌లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అస్సాంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఎస్సెమ్మెస్‌ల రూపంలో వచ్చే రూమర్లతో అధికమవుతున్నాయని భావించిన కేంద్ర ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది. రోజుకు ఐదు ఎస్ఎంఎస్‌ల కంటే ఎక్కువ పంపకూడదని కేంద్రం షరతు విధించింది.
అస్సాంలో పరిస్థితి సద్దుమనగడంతో నిషేధం ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ఈ రోజు ప్రకటించింది. అస్సాంలో మత ఘర్షణలు చెలరేగడానికి ఈ ఎస్సెమ్మెస్‌లే మూల కారణమని గుర్తించిన కేంద్రం, ఎస్ఎంఎస్‌లపై నిషేధం విధించింది. వాటిపై విచారణ జరిపిన ప్రభుత్వం అవి దొంగ ఎస్సెమ్మెస్‌లుగా గుర్తించి నిషేధం ఎత్తివేసింది.
ఇటీవల అస్సాంలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఉన్న ఈశాన్య వాసులకు భారీగా బెదిరింపు ఎస్సెమ్మెస్‌లు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో బెంగళూరు, హైదరాబాదు తదితర ప్రాంతాల నుండి భారీగా ఈశాన్య వాసులు స్వంత రాష్ట్రాలకు తరలి వెళ్లారు.












Click it and Unblock the Notifications