నెల్లూరు వద్ద రైలు ప్రమాదం: బాణసంచా వల్లనే

కోచ్ - 11లో తీసుకుని వెళ్తున్న బాణసంచా కాలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ డైరెక్టర్ ఒ. నరసింహమూర్తి చెప్పారు. రైలు కోచ్‌లోంచి తాము బాణసంచాకు సంబంధించిన కొనని రసాయనాల నమూనాలను సేకరించినట్లు ఆయన తెలిపారు. బాణసంచా పేలడం వల్లనే ఆ భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు పరిశోధనలో తేలిందని చెప్పారు.
అయితే, తొలుత అగ్ని ఎలా అంటుకుందనేది మాత్రం కనుక్కోలేకపోయామని అన్నారు. బాణసంచాలపై ఒత్తిడి వల్ల అవి పేలి ఉంటాయని భావిస్తున్నారు. కోచ్‌లో సీట్ల కింద బాణసంచాను పెట్టినట్లు తేలింది. నెల్లూరు వద్ద సంభవించిన రైలు ప్రమాదం వెనక ఉగ్రవాదుల హస్తం ఉండవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఫోరెన్సిక్ పరీక్షలు దాన్ని కొట్టిపారేస్తున్నాయి.
బాణసంచా తయారీకి వాడిన రసాయనాల వల్లనే మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. బాణసంచా పేలిన శబ్దాలను ప్రయాణికులు విని ఉంటారని చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కూడా జరిగిందని అంటున్నారు. షార్ట్ సర్క్యూట్‌కు చాలా కారణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. పవర్ పాయింట్ నుంచి మొబైల్‌ను లేదా లాప్‌టాప్‌ను చార్జ్ చేయడం వల్ల కూడా సంభవించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
కోచ్‌లోని బెర్త్ కుషన్స్‌కు వాడిన రెగ్జిన్, సింథటిక్ స్పాంజ్ వల్ల కూడా మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications