వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేసిన తప్పేంటో చెప్పండి: వైయస్ విజయమ్మకు బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఫీజు రీయింబర్సుమెంట్సు పైన దీక్ష చేసే ముందు తమ ప్రభుత్వం చేసిన తప్పేమిటో చెప్పాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం ప్రశ్నించారు. కేవలం ధనవంతుల పిల్లలకు మాత్రమే ఫీజు రీయింబర్సుమెంట్సును దూరం చేశారని చెప్పారు. ఇంత పెద్ద పథకంలో కొంతమందికి అన్యాయం జరగవచ్చునని అన్నారు. లోపం ఎక్కడుందో విజయమ్మ చెప్పాలని ప్రశ్నించారు.

ఫీజు రీయింబర్సుమెంట్సు పైన తెలుగుదేశం పార్టీకి మాట్లాడే హక్కు ఏమాత్రం లేదన్నారు. కార్పోరేట్ కళాశాలలతో కుమ్మక్కై వారు పసలేని వాదనలు చేస్తున్నారని ఆరోపించారు. యాజమాన్యాల శ్రేయస్సు కోసమే టిడిపి నేతలు అలా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెసు అధికారంలో ఉన్నంత కాలం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడుతామన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్నదే వైయస్ చివరి కోరిక అన్నారు.

తెలంగాణ సమస్య పరిష్కారం కోసం యుపిఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని తాము కూడా కోరుతున్నామని అన్నారు. సుజయ కృష్ణ రంగారావు, ఆళ్ల నానిల రాజీనామాలపై ఇప్పటికే వివరణ అడిగామని చెప్పారు. విద్యుత్ సమస్యను రాజకీయం చేయకుండా నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వేరుగా అన్నారు. త్వరలోనే శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. విద్యుత్ సమస్యను విపక్షాలు రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు.

English summary
PCC chief Botsa Satyanarayana has questioned YSR Congress party honorary president YS Vijayamma about Fee reimbursements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X