బొగ్గు స్కాం: దాసరిని ప్రశ్నిస్తున్న సిబిఐ, ఖండన

ఈరోజు(మంగళవారం) ఉదయం ఆరు గంటలకు దాసరిని ఆయన గెస్టు హౌస్‌లో సిబిఐ ప్రశ్నించినట్లుగా సమాచారం. మధ్యాహ్నం తిరిగి దాసరిని ప్రశ్నిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో హైదరాబాదుతో సహా దేశంలోని ముప్పై చోట్ల సిబిఐ ఏకకాలంలో బొగ్గు స్కాం విషయమై దాడులు నిర్వహించింది. హైదరాబాదులో ఐదుచోట్ల దాడులు చేసింది. కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్‌లలోని నవభారత్ కంపెనీ, నిమ్మీ ఐరన్ అండ్ స్టీల్స్, జెఏల్‌డి ఐరన్స్, ఏఎమ్మార్ ఐరన్ అండ్ స్టీల్స్, జెయుఎస్ ఇన్ ఫ్రా తదితర కంపెనీలలో సిబిఐ సోదాలు చేసిందని తెలుస్తోంది. హైదరాబాదులో విచారణకు 12 మందితో కూడిన దర్యాఫ్తు బృందం విచారిస్తోంది
కాగా బొగ్గు బ్లాకుల అక్రమ కేటాయింపులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) దర్యాప్తును ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఐదు కంపెనీలపై, గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులపై సిబిఐ మంగళవారం కేసులు నమోదు చేసింది. దాంతో పాటు పది నగరాల్లో సోదాలు నిర్వహిస్తోంది. మోసం చేశాయనే ఆరోపణపై ఐదు కంపెనీలపై, ప్రభుత్వాధికారులపై కేసులు నమోదు చేసినట్లు సిబిఐ అధికార వర్గాలు చెప్పారు. పది నగరాల్లోని 30 ప్రాంతాల్లో సిబిఐ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, పాట్నా, ధన్‌బాద్, నాగపూర్ నగరాల్లో సోదాలు జరుగుతున్నట్లు సిబిఐ అధికారులు చెప్పారు.
కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు సిబిఐ బొగ్గు కుంభకోణంపై మూడు నెలల పాటు ప్రాథమిక విచారణ జరిపిన సిబిఐ ఇప్పుడు కేసులు నమోదు చేసింది. మైనింగ్ పనుల్లో జాప్యంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కొన్ని కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రాథమిక విచారణ సమయంలో సిబిఐకి తెలిపింది.
2005లో బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులు పొందిన కంపెనీలు కొన్ని ఇప్పటికీ మైనింగ్ పనులను ప్రారంభించలేదని మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి. జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని కంపెనీలు పనులు ప్రారంభించకపోగా, బొగ్గు బ్లాకులను సబ్ లీజుకు ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. 2005 - 09 మధ్య కాలంలో కోల్ బ్లాక్‌ల కేటాయింపులపై సిబిఐ అధికారులు ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులను ప్రశ్నించారు.
కాగా సోదాల విషయమై దాసరి నారాయణ రావు స్పందించారు. తన ఇంట్లో, సంస్థలలో సిబిఐ ఎలాంటి సోదాలు నిర్వహించలేదని ఆయన చెప్పారు. తనను కూడా సిబిఐ విచారించలేదన్నారు. అభిమానులు నిరాధార వార్తలు నమ్మొద్దన్నారు. ఇందుకు సంబంధించి దాసరి ఓ ప్రెస్ నోటి విడుదల చేశారు. మరోవైపు కోల్ గేట్ వ్యవహారంలో ఐదు సంస్థలపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications