లవర్ సహా నలుగురిని కాల్చి చంపి, ప్రియుడి ఆత్మహత్య

రేణును, ఆమె ఇంటి యజమాని షీలాను ఢిల్లీలోని బిందాపూర్‌లో కాల్చిచంపాడు.
ఆ తరువాత 40 కిలోమీటర్లు ప్రయాణించి ఘజియాబాద్ వెళ్లి రేణు తండ్రి హరీందర్, సోదరి బేబిని
హతమార్చాడు. రేణుకు పెళ్లయినా కూడా ఆమెతో రవి సంబంధాలను కొనసాగిస్తున్నాడని పోలీసు వర్గాలు
చెబుతున్నాయి. రేణును పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబ సభ్యులు అనుమతించక పోవడమే ఈ ఘాతుకానికి అతడు పాల్పడటానికి కారణమైనట్టు తెలుస్తోంది.
సోమవారం ఉదయం 9.10 గంటల ప్రాంతంలో రేణు, షీలాలను రవి కాల్చి చంపినట్టు పోలీస్ వర్గాలు
వెల్లడించాయి. మొదట రేణును కాల్చి చంపిన హంతకుడు, ఆ అరుపులు విని అక్కడకు వచ్చిన మృతురాలి
తల్లి షీలాను కూడా మట్టుబెట్టాడు. ఈ రెండు తుపాకి పేలుడు శబ్దాలను విన్న దినేష్ అనే వ్యక్తి అక్కడకు
వచ్చాడని, రెండు చేతుల్లోనూ తుపాకులు పట్టుకుని రవి పరిగెత్తడాన్ని చూసినట్టు వెల్లడించాడని పోలీసులు తెలిపారు.
అయితే, అతడిని అడ్డుకునేందుకు దినేష్ ప్రయత్నించాడని, కాల్చేస్తానని రవి బెదిరించటంతో పక్కకు
తప్పుకున్నాడని, తరువాత రవి కారులో పారిపోయినట్టు పోలీస్ అధికార్లు తెలిపారు. ఈ సంఘటన
జరిగిన సమయంలో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్న రేణు భర్త ఇంట్లోలేడని పోలీసులు తెలిపారు. కాల్పులు
జరిపిన సమయంలో ఆ ఇంట్లో పనిమనిషి తప్ప మరెవరూ లేరని, ఆ ఘాతుకాన్ని చూసి విస్తుపోయిన
ఆమె ఏమీ చెప్పలేకపోతోందని పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications