వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో కెవిపికి అవగాహన, ఎక్కడ తేలుతారో: విహెచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లోనే ఉండి అన్ని విధాలా సహాయం చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు కెవిపి రామచందర్ రావు హామీ ఇచ్చారని, ఈ మేరకు వారి మధ్య ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న కెవిపి చివరికి ఎక్కడ తేలతారోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు ఉపయోగపడేలా, వైసీపీకి అనుకూలించేలా కెవిపి కార్యక్రమాలను రూపొందిస్తున్నారని ఆరోపించారు.

తండ్రి వైఎస్ మంచోడు, కొడుకు జగన్ చెడ్డోడు అంటే ఎవరూ నమ్మరని తాను రెండేళ్లుగా చెబుతూనే ఉన్నానని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి నియమించిన మంత్రుల కమిటీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వైయస్ రాజశేఖర రెడ్డి ఫొటోను తొలగించాలని కమిటీ వెల్లడించిందన్నారు. వైయస్‌ను కొలిస్తే అది వైయస్సార్ కాంగ్రెసుకే లబ్ధి చేకూరుస్తుందని నివేదికలో అన్నారు.

కానీ, కెవిపి రామచందర్ రావు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా వైఎస్ పేరిట కార్యక్రమాలు చేస్తూ జగన్‌కు లాభం చేస్తున్నారని దుయ్యబట్టారు. నిరుడు వైయస్ ఫొటో ఎగ్జిబిషన్ పెట్టిన ఆయన, ఇప్పుడు వైఎస్ పాదయాత్ర డైరీ ఆవిష్కరణ అంటూ మరో కార్యక్రమం పెట్టడం సరి కాదన్నారు. నిజానికి వైఎస్ పాదయాత్ర పార్టీ కోసం కాదు, ఆయన రాజకీయం కోసమేనని ఆహ్వాన పత్రంలోనే పేర్కొన్నారని తెలిపారు.

వరంగల్‌లో తన బీసీల సభకు భారీగా జనం వచ్చారని, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేస్తానంటే వైయస్ వద్దని అడ్డుకున్నారని, వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే పాదయాత్రను మొదలు పెట్టారని ఆరోపించారు. వైయస్ మరణానికి సోనియానే కారణమని వైఎస్ విజయలక్ష్మి నిందించినా నేటి వరకూ కెవిపి నోరు విప్పలేదని, ఆమె ఆరోపణలను ఖండించలేదన్నారు. పైగా, తాను సమావేశానికి రాలేనంటూ సోనియా చెబితే, దాన్నే ఆమె సందేశంగా పుస్తకంలో ప్రచురించటం సమంజసం కాదన్నారు.

కేవలం వైఎస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేశారన్న కారణంతోనే ఆజాద్, మోతీలాల్ వోరాలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని, అయితే కార్యకర్తలు ఆ విషయాన్ని సరిగా అర్థం చేసుకోరని చెప్పారు. కాగా, వైయస్ పాదయాత్ర సందర్భంగా ఏఏ భూముల గురించి తన డైరీలో ఏమేం రాశారో కూడా ప్రచురించాల్సి ఉందన్నారు.

English summary
V Hanumanth Rao alleged that his party has an understanding with YSR Congress party president YS Jagan. He lashed out at KVP Ramachandar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X