తెలంగాణ: సోనియాకు ఎమ్మెల్యేల లేఖ, సభ వాయిదా

తెలంగాణ మార్చ్ లోపు ప్రకటన రాకుంటే పార్టీ నష్ట పోవాల్సి వస్తుందన్నారు. మార్చ్ తర్వాత ఉద్యమం మరింత ఉధృతమవుతుందని అప్పుడు కాంగ్రెసుకు కష్టాలు తప్పవని వారు పేర్కొన్నారు. కాగా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంపై తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రేమ లేదని ఆరోపించారు. తీర్మానం కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు పట్టుబట్టడం సరికాదన్నారు.
తీర్మానం పెడితే వీగిపోతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పినప్పటికీ వారు రాద్దాంతం చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో తీర్మానం వీగిపోతేనే రాజకీయంగా తమకు మనుగడ ఉంటుందని తెరాస భావిస్తోందని ఆరోపించారు. కాగా సోమవారం, మంగళవారం తెలంగాణపై తీర్మానం పెట్టాలని టిఆర్ఎస్ డిమాండ్ చేయడంతో సభ వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఈరోజు కూడా తెలంగాణపై తీర్మానం పెట్టాలని తెరాస, ఎఫ్‌డిఐలను, పెట్రో ధరలను నిరసిస్తూ టిడిపి, వామపక్షాలు సభను అడ్డుకున్నాయి. సభ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్, ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేసినా ఫలితం లేక పోయింది.
స్పీకర్ పోడియాన్ని విపక్షాలు చుట్టుముట్టాయి. ఆందోళనను కొనసాగించాయి. నినాదాలు చేస్తూ సభను అడ్డుకోవడంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. సభ వాయిదా పడిన అనంతరం కాంగ్రెసు నేతలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూండగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా కాంగ్రెసుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications