వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రస్తుతానికి సిఎం సేఫ్: తెరాస విలీనంపైనే చర్చలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia - KCR
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చాలనే ఆలోచనకు కాంగ్రెసు అధిష్టానం ప్రస్తుతానికి స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణపై నిర్ణయంలో భాగంగానే ముఖ్యమంత్రి మార్పుపై ఆలోచన చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పంపించాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అదే మీడియా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని మార్చే యోచనకు అధిష్టానం తాత్కాలికంగా స్వస్తి చెప్పినట్లు వార్తలను ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని తమ పార్టీలో విలీనం చేసుకోవడంపైనే కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. ఈ మేరకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో అధిష్టానం పెద్దలు వరుసగా చర్చలు జరుపుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిస్తూ, ఆ మేరకు ప్రకటన చేయడానికి కూడా కాంగ్రెసు అధిష్టానం ముందుకు వస్తున్నట్లు ఆ వార్తల సారాంశం. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తెరాసను తమ పార్టీలో విలీనం చేయడానికి కెసిఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాంగ్రెసు అధిష్టానం ఢిల్లీకి పిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ పరిస్థితిపై తెలుసుకోవడానికి ఆయనను ఢిల్లీకి పిలిచినట్లు చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర నుంచి వచ్చే స్పందనపై కూడా కాంగ్రెసు అధిష్టానం ఆరా తీస్తున్నట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్ నుంచి కూడా సోనియా ఆ వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడానికి కూడా రంగం సిద్దమైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అందులో చిరంజీవికి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. పార్టీని రక్షించుకోవడానికి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం తప్ప మార్గాంతరం లేదని సోనియా గాంధీ భావిస్తున్నట్లు జాతీయ మీడియా వ్యాఖ్యానిస్తోంది.

ఇదిలావుంటే, విలీనం వార్తలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మాజీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ ఖండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన తర్వాతనే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ఆయన అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం ప్రకటన వెలువరించే తరుణంలో దాన్ని అడ్డుకోవడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

English summary
According to national media - Congress has withdrawn the proposal of changing CM Kiran kumar Reddy. Iy has decided resolve the Telangana issue before taking up the leadership change. It has concentrated on the issue of TRS merger.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X