వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో యాంటీ ముస్లిం చిత్రం చిచ్చు: 20 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Pakistan
ఇస్లామాబాద్: అమెరికా దర్శకుడు రూపొందించిన ఇస్లాం వ్యతిరేక చిత్రం ప్రపంచవ్యాప్తంగా చిచ్చు రగిలిస్తూనే ఉంది.. 'ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిం' అనే పేరుతో వచ్చిన ఈ చిత్రానికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో శుక్రవారం చేపట్టిన భారీ నిరసన ర్యాలీ హింసకు దారితీసింది. ఈ హింసలో దాదాపు 20 మంది మృత్యువాత పడ్డారు.

పోలీసులు, ఆందోళనకారులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణల్లో 20 మంది మృతి చెందారు. మరో వంద మంది వరకు గాయపడ్డారు. వీరిలో అనేక మంది పరిస్థితి ఆందోనకరంగా ఉంది. పాక్ తీరప్రాంతంలోని కరాచీలో చెలరేగిన హింసలో అత్యధికంగా 14 మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.

ఈ నిరసన ర్యాలీలో ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండి, కరాచీ తదితర నగరాల్లో వేల ముస్లిం పాల్గొన్నారు. ఈ ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా పాక్ టెలికామ్ శాఖ 15 నగరాల్లో మొబైల్ సేవలను కూడా పూర్తిగా ఆపేసింది. అయినప్పటికీ హింస ప్రజ్వరిల్లింది.

ప్రవక్తను ప్రేమించే రోజు పేరుతో పాకిస్తాన్‌లో ర్యాలీలు తీశారు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. సినిమా హాళ్లకు నిప్పు పెట్టారు. పెషావర్‌లోని చేంబర్ ఆఫ్ కామర్స్‌కు కూడా నిప్పంటించారు. పెషావర్‌లో చెలరేగిన హింసలో ఓ టీవీ చానెల్ ఉద్యోగితో పాటు ఐదుగురు మరణించారు. పోలీసు కాల్పుల్లో బుల్లెట్ తగిలి ఎఆర్‌వై న్యూస్ ఉద్యోగి మొహమ్మద్ అమీర్ మరణించాడు.

కరాచీలోని మూడు సినిమా హాళ్లను, మేూడు ప్రభుత్వ కార్యాలయాలను, మూడు బ్యాంకులను, పలు పోలీసు వాహనాలను అల్లరి మూకలు దగ్ధం చేశాయి.

English summary
Nearly 20 people were killed and hundreds injured today when thousands of angry demonstrators during government-sanctioned protests over an anti-Islam film turned violent in several cities across Pakistan on a day being observed as 'Love the Prophet Day'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X