అస్వస్థతతో పరీక్షల మీద పరీక్షలు: శ్రీలక్ష్మికి శస్త్రచికిత్స?

గత రెండు వారాలుగా శ్రీలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడవలేకపోవడం వంటి సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు మహిళా జైలు సూపరింటిండెంట్‌కు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.
శ్రీలక్ష్మికి వైద్యం చేస్తున్న ఉస్మానియా ఆస్పత్రి డాక్టర్ సలహా మేరకు శ్రీలక్ష్మిని మంగళవారం నిజాం వైద్య విజ్ఞాన సంస్థకు (నిమ్స్‌కు) తీసుకుని వెళ్లారు. నిమ్స్‌లో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. ఆమెకు శస్త్రచికిత్స అవసరం ఏర్పడవచ్చునని అంటున్నారు.
గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి అక్రమ తవ్వకాల కేసులో అరెస్టయిన శ్రీలక్ష్మి జైలులో ముభావంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఒఎంసికి మేలు జరిగే విధంగా శ్రీలక్ష్మి జీవోలను జారీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆమెకు తొలుత బెయిల్ లభించినప్పటికీ ఆ తర్వాత రద్దయింది. దీంతో ఆమె జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications