తెలంగాణపై స్పష్టత లేదు: బాబు లేఖ బొత్స ఫైర్

రాజకీయాలు చేస్తోంది కాంగ్రెసు పార్టీ కాదని, తెలుగుదేశం పార్టీయే అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ వల్లనే రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని తప్పు పట్టారు. తెలంగాణ మార్చ్ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శ్రేయస్సుకు కృషి చేయలేదని, తమను చేయనీయడం లేదని బొత్స వ్యాఖ్యానించారు. విద్యుత్తు చార్జీల పెంచబోమని తాము 2009 ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వలేదని ఆయన అన్నారు. అదనంగా మూడు సిలిండర్లు సబ్సిడీ రేటుకు ఇవ్వాలని తమకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి లేఖ రాలేదని చెప్పారు.
తెలంగాణపై ప్రధానికి రాసిన చంద్రబాబు లేఖను స్వాగతించలేమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. అఖిలపక్ష సమావేశంలో చెప్పినప్పుడే నమ్ముతామని ఆయన హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ మార్చ్‌లో తాము పాల్గొంటామని స్పష్టం చేశారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని, అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రులు విజ్ఞప్తి చేసినా అనుమతి ఇవ్వకపోేత ప్రభుత్వానికి అగౌరవమని అన్నారు. తెలంగాణపై వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఏ అంశంపై కూడా ఏకాభిప్రాయం సాధ్యం కాదని కె. కేశవ రావు అన్నారు. కేశవరావు నివాసంలో గురువారంనాడు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications