హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెదిరింపులకు భయపడను, సెంటిమెంట్‌తో: శ్రీధర్ బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sridhar Babu
హైదరాబాద్/కరీంనగర్: రాష్ట్రంలో, జిల్లాలో తాను అభివృద్ధి కాంక్షతో పని చేస్తున్నానని, ఎవరు ఎన్ని రకాలుగా బెదిరించినా భయపడే ప్రసక్తి లేదని, తనను భౌతికంగా లేకుండా చేస్తామంటూ కొందరు మాట్లాడుతున్నారని, అయినప్పటికీ తాను బెదిరే ప్రసక్తి లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బుధవారం అన్నారు. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ వాడుకుంటున్న కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కరీంనగర్ జిల్లా మంథనిలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ నిర్మాణ్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అయితే శ్రీధర్ బాబు.. ఇటీవల తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలనుద్దేశించి అని తెలుస్తోంది.

కవాతులో పాల్గొంటాం.. పొన్నం

ఈ నెల 30వ తేదిన జరిగే తెలంగాణ కవాతుకు ప్రభుత్వం నుండి అనుమతి ఇప్పించే బాధ్యత తెలంగాణ ప్రాంత మంత్రుల పైనే ఉందని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు జి.వివేక్ అన్నారు. మంత్రులు ప్రభుత్వాన్ని ఒప్పించి అనుమతి తీసుకు వస్తే కవాతు ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులమంతా కవాతులో పాల్గొంటామని వివేక్ స్పష్టం చేశారు.

మార్చ్‌ను అడ్డుకోవద్దు.. రాఘవులు

తెలంగాణ మార్చ్‌ను ప్రభుత్వం అడ్డుకోవాలనుకోవడం తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. బుధవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తమ విధానం సమైక్యవాదం అయినప్పటికీ ఉద్యమకారులను అణచివేయడాన్ని తప్పుబడుతున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఉద్యమాలను అణచివేయడం అప్రజాస్వామ్యమన్నారు.

రాష్ట్ర విభజన, సమైక్యం అంశాలను పరిష్కరించకుండా నాన్చుతూ కాంగ్రెస్ నాటకాలాడుతోందన్నారు. ప్రజలను మభ్యపెట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలన్న ఆలోచన లేదన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ అంశం చుట్టూనే తిరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలకు, కేసీఆర్ మాటలకు విలువే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వార్తలు లీక్ చేయడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ప్రజల్లో నిరాశలు కల్పిస్తుందని విమర్శించారు.

English summary

 Minister Sridhar Babu responded on Telangana JAC chairman Kodandaram statement on Wednesday in Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X