తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మబలిదానం

'తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలి. నా చావుతోనైనా తెలంగాణ ఏర్పడాలి. జై తెలంగాణ. జైజై తెలంగాణ' అంటూ తన నోట్‌బుక్‌లో రాసుకున్నాడు. ఏఐఎస్ఎఫ్ మండల ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న శ్రీధర్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు. శ్రీధర్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
శ్రీధ్రర్ తెలంగామ విద్యార్థి జెఎసి మండల కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ విద్యార్థి జెఎసి నాయకులు, గ్రామస్థులు, విద్యార్థులు చౌటుప్పల్‌లోని బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఆ దారి గుండా హైదరాబాద్ వెళ్తున్న కాంగ్రెసు తెలంగాణ శానససభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాస్తారోకోలో పాల్గొన్నారు.
పుత్రశోకం తనకు తెలుసునని, విద్యార్థులు ఆత్మహత్యలకు దూరంగా ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణకు అడ్డం పడుతున్నవారిని చంపాలే తప్ప ఎవరూ చావకూడదని ఆయన కోరారు. శ్రీధర్ తల్లి దుర్గమ్మ గృహిణి. శ్రీధర్‌కు తమ్ముడు శ్రీకాంత్, చెల్లె శ్రీలత ఉన్నారు.












Click it and Unblock the Notifications