ప్రియుడి కోసం కన్నకొడుకును హత్య చేసిన మహిళ

బేతంచర్లలో ప్రియుడు బాషాతో పాటు కలిసి ఉంటున్న లక్ష్మి అనే మహిళ తన కుమారుడిని చంపి ఓర్వకల్లు మండలం చకునాపల్లి గ్రామంలోని తన భర్త ఇంటి వద్ద వదిలేయడానికి ప్రయత్నించింది. హత్యా నేరాన్ని భర్తపై మోపాలనే ఉద్దేశంతో ఆమె ఆ పనిచేసింది.
అయితే, స్థానికులు ఆమె కుమారుడి శవాన్ని తీసుకుని అక్కడ పెట్టడం గమనించి గ్రామస్థులు ఆమెను పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ తర్వాత ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆమె కుమారుడి శవాన్ని కూడా పోలీసులకు అప్పగించారు.
భర్తను వదిలేసి గత 20 రోజులుగా లక్ష్మి బేతంచర్లలో బాషాతో కలిసి ఉంటోంది. తనతో రావాలని భర్త ఆమెను పదే పదే వేడుకున్నా వినలేదు. పెద్ద మనుషులతో కూడా చెప్పించాడు. అయినా ఆమె వినలేదు. చివరకు కన్న కొడుకుని చంపి తన భర్త మీదికి నేరాన్ని వేయడానికి పూనుకుంది.












Click it and Unblock the Notifications