విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై బాబు లేఖ: లగడపాటి ఫైర్, అడ్డుకుంటాం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చాలని, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారి ఐక్యత కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని.. కానీ చంద్రబాబు వైఖరి అందుకు భిన్నంగా ఉందని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే తలెత్తే సమస్యలపై చంద్రబాబు ఆలోచించారా అని ప్రశ్నంచారు. తన పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవడానికే చంద్రబాబు ప్రధానమంత్రికి లేఖ రాశారని ఆయన ఆరోపించారు. సీమాంధ్రలో బాబు పాదయాత్రను అడ్డుకుంటామని చెప్పారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో టిడిపి ఘోర పరాజయం చవి చూసిందని, విభజనకు మద్దతు పలికితే ఆ కాస్తా కూడా ఉండదన్నారు.

రాష్ట్రం విభజిస్తే అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. చంద్రబాబు విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. తెలుగువారి ఐక్యత కోసమే టిడిపి అని పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీఆర్ చెప్పారన్నారు. విభజనతో పలు సమస్యలు తలెత్తుతాయన్నారు. లగడపాటి చంద్రబాబుకు మూడు పేజీల లేఖ రాశారు. చంద్రబాబు లేఖ పైన ఆ పార్టీ సీమాంధ్ర నేతలు స్పందించాలని జోగి రమేష్ అన్నారు. సీమాంధ్రలో బాబు యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. బాబు లేఖ ఓ డ్రామా అని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు.

English summary
Vijayawada MP Lagadapati Rajagopal was lashed out at Telugudesam Party chief Nara Chandrababu Naidu on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X