ఎవరైనా వదలొద్దు: డిజిపికి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్

మరో ఎనిమిది కౌంటర్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కౌంటర్లలోని పరికరాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్‌కి చెందిన దాదాపు ఇరవై ఐదుమంది ఇందులో పాల్గొన్నట్లుగా అనుమానిస్తున్నారు. సెప్టెంబర్ 30న జరిగే కవాతును ప్రభుత్వం అణచాలని చూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని కరపత్రాలు ఘటనస్థలంలో లభించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్‌గా రియాక్ట్ అయినట్లు సమాచారం. డిజిపికి వెంటనే ఫోన్ చేసి భద్రత విషయంలో రాజీ పడవద్దని, నిందితులు ఎంతటి వారైనా, ఎవరైనా వదలొద్దని సూచించారని తెలుస్తోంది. నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారని సమాచారం. దాడి ఘటనను సీరియస్‌గా తీసుకోమని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మార్చ్, వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications