ఓయులో మళ్లీ ఉద్రిక్తత: వేదిక పైనే సిఎం.. టి-మంత్రులు

వేదిక మార్చుకుంటే... టి-మంత్రులతో కిరణ్
తెలంగాణ కవాతు నేపథ్యంలో తెలంగాణ ప్రాంత మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఉదయం భేటీ అయ్యారు. ఆ ప్రాంతానికి చెందిన పదకొండుమంది మంత్రులు భేటీలో పాల్గొన్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఢిల్లీలో ఉన్నందున, రాంరెడ్డి వెంకట రెడ్డి ఖమ్మంలో ఉన్నందున భేటీలో పాల్గొనలేదు. నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ కూడా గైర్హాజరయ్యారు. అయితే వీరు కవాతును వ్యతిరేకిస్తున్నారని అందుకే భేటీకు రాలేదని సమాచారం.
కవాతును వేదికను మార్చుకుంటే అనుమతిస్తామని తెలంగాణ ప్రాంత మంత్రులతో ముఖ్యమంత్రి చెప్పారని తెలుస్తోంది. గణేష్ నిమజ్జనం, జీవ వైవిధ్య సదస్సు దృష్ట్యా కవాతును ట్యాంక్‌బండ్ పైన నిర్వహించడం సరికాదని, అక్కడ అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని, కాబట్టి వేదిక మార్చుకోవాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితికి, తెలంగాణ ప్రజా సంఘాలకు సూచించాలని కిరణ్ మంత్రులకు తేల్చి చెప్పారని తెలుస్తోంది.
హైదరాబాదులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతిచ్చేది లేదని కిరణ్ వారితో చెప్పారు. డిజిపి దినేష్ రెడ్డి కూడా విలేకరుల సమావేశంలో అదే విషయం చెప్పారు. కాగా వేదిక మార్పు పైన ఐకాస, ప్రజా సంఘాలతో మాట్లాడాలని తెలంగాణ ప్రాంత మంత్రులు నిర్ణయించుకున్నారు. వారితో మాట్లాడి కవాతును వాయిదా వేయించడం లేదా వేదికను మార్పు చేయించడం చేయాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications