హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆలస్యం చేస్తే కష్టం: ఆస్కార్‌తో కెసిఆర్, బొత్సతో కెటిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: ఓ వైపు హైదరాబాదులో తెలంగాణ కవాతు వేడి రగులుతుంటే... మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు న్యూఢిల్లీలో కాంగ్రెసు పెద్దలతో చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. కవాదు సమయం సమీపిస్తున్న కొద్దీ ఢిల్లీలో కెసిఆర్ శిబిరంలో ఉద్విగ్నత పెరిగిపోతోంది. కెసిఆర్ అభ్యర్థన మేరకు కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి ఆస్కార్ ఫెర్నాండెజ్ గురువారం రాత్రి ఆయన నివాసానికి వచ్చారు.

కెసిఆర్‌తో కొద్దిసేపు మంతనాలు జరిపారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ విషయంలో ఆలస్యం చేస్తున్న కొద్దీ ప్రజల్లో అసహనం పెరిగి అవాంఛనీయ పరిణామాలు జరగవచ్చునని ఫెర్నాండెజ్ వద్ద కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేసినట్లుగా సమాచారం. తెలంగాణ విషయంలో ఒక స్పష్టమైన హామీ ఇస్తే... మార్చ్‌ను వెనక్కు తీసుకునేందుకు వీలుంటుందని, తమకూ ప్రజల్లో విశ్వసనీయత మిగులుతుందని చెప్పినట్లు సమాచారం.

ఈ విషయాన్ని తాను సోనియాకు వివరించి మళ్లీ కలుస్తానని ఫెర్నాండెజ్ ఆయనకు హామీ ఇచ్చి వెళ్లిపోయారు. ఇక కెసిఆర్ కుమారుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు గురువారం సాయంత్రం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. తాము ఏఐసిసి నేతలతో చర్చలు జరుపుతున్నామని, కొంత సానుకూల వాతావరణం ఏర్పడిందని కెటిఆర్ ఆయనకు వివరించారని తెలుస్తోంది.

ఇతర రాజకీయ పరిణామాల వల్ల ఈ చర్చలు ఇంకా పూర్తి కాలేదని, అందుకు కొంత సమయం పట్టవచ్చునని చెప్పినట్లు తెలిసింది. మీరు కూడా అధిష్ఠానంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయండని అని బొత్సను కోరారు. అయితే... ఢిల్లీ పెద్దలు కోరితే తప్ప ఇందులో తాను తలదూర్చలేనని బొత్స నిస్సహాయత వ్యక్తంచేసినట్లు తెలిసింది. కాగా... రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డిని కూడా కెసిఆర్ కలిసినట్లు సమాచారం.

English summary
Telangana Rastra Samithi president K Chandrasekhar Rao was met Congress party senior leader Oscar Fernandes on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X