1 నుండి 10 వరకు బాబే: పయ్యావుల, హరికృష్ణ పైనా..

విభేదాలు ఉన్నాయని, లేవని అంతా చెప్పేది మీడియా మాత్రమే అన్నారు. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ పాదయాత్రలో పాల్గొనడం తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు. పార్టీకి నందమూరి, నారా కుటుంబాలు రెండూ అవసరమేనని, ఆ రెండు కుటుంబాలు నాణేనికి రెండు వైపుల అనుకోవచ్చునని తెలిపారు. పాదయాత్రలో బాబుకు వస్తున్న ఆదరణ చూస్తుంటే 2014లో టిడిపి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, బాబు ముఖ్యమంత్రి అవుతారని గట్టిగా విశ్వసిస్తున్నామన్నారు.
చంద్రబాబు పాదయాత్రపై కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఆత్మహత్యల పేరుతో ఏళ్లకేళ్లకు ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న జగన్ పార్టీ బాబు పాదయాత్రను శవయాత్రతో పోల్చడం హేయమమన్నారు. శుభప్రదంగా జరుగుతున్న యాత్రను వారు అలా వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications