చర్చలు సక్సెస్, తెలియకుండా చాలామందితో..: కెసిఆర్

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో జరిపిన చర్చలు ఫలఫ్రదంగా ముగిశాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఆయన హైదరాబాదుకు బయలుదేరే సమయంలో న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలువురు నేతలతో తాను తెలంగాణ అంశంపై చర్చించానని చెప్పారు.

చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, ఫలప్రదంగా ముగిశాయన్నారు. త్వరలో సానుకూల నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. త్వరలో తుది విడత చర్చలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. తాను పలువురు సీనియర్లతో భేటీ అయ్యానని చెప్పారు. మీడియాకు తెలిసి కొందరితోనే భేటీ అయ్యానని కానీ, తెలియకుండా చాలామందితో చర్చించానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఆహ్వానం మేరకే తాను ఢిల్లీకి వచ్చానన్నారు.

త్వరలో సుదీర్ఘ చర్చలు జరిగి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. తాను ముగ్గురు నలుగురు నేతలతోనే మాట్లాడలేదని చాలామందితో మాట్లాడానని చెప్పారు. కాగా కెసిఆర్ గత నెల నాలుగో తారీఖున పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు ఆ తర్వాత రెండు రోజులే జరిగినప్పటికీ అప్పటి నుండి ఆయన నెల రోజుల పాటు అక్కడే ఉండి తెలంగాణపై అధిష్టానంతో చర్చలు జరిపారు.

కెసిఆర్ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికేందుకు తెరాస శ్రేణులు భారీగా అక్కడకు తరలి వెళ్లాయి. చర్చలు ఫలప్రదమైనవని ఆయన ప్రకటించినందు వల్ల ఆ పార్టీలో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఆయన కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+