హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాయికుమార్ బుట్టలో పడిన సౌరవ్ గంగూలీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sourav Ganguly
హైదరాబాద్: రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ కుంభకోణం కేసులో కీలక సూత్రధారి సాయికుమార్ బుట్టలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గుంగూలీ కూడా పడ్డారు. సాయికుమార్ చేపట్టిన వన్ కార్డ్ - వన్ నేషన్‌ పథకానికి గంగూలీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. వాణిజ్య కంపెనీలకు ప్రముఖులున బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడం పరిపాటి. కానీ, కంపెనీ నిర్వాహకుల పూర్వపరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి అంగీకరిస్తారు. కానీ వన్ కార్డు వన్ నేషన్ ప్రచారకర్తగా ఉండడానికి గంగూలీ ఎలా వ్యవహరించాడనేది ఆశ్చర్యకరంగానే ఉంది. వన్ కార్డ్ బిజినెస్ మోడల్ గురించి గంగూలీ ఆలోచించారా అనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.

మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ కుంభకోణం సూత్రదారి సాయి కుమార్ చార్టర్డ్ అకౌంటెంట్. అతని బ్యాంకుల పనితీరు గురించి పూర్తిగా తెలుసునని అనుకోవడానికే వీలుంది. కవరింగ్ లేఖ సాయంతో నిధులను మళ్లించడానికి అవకాశం ఉందని గుర్తించిన అతను తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశాడని అంటున్నారు. మొత్తం 165 సంస్థలను స్థాపించడంతో పాటు వన్ కార్డ్ - వన్ నే,షన్ పేరుతో క్రెడిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు అన్నంటినీ ఒకే కార్డులో ఇస్తామని చెబుతూ పెద్ద యెత్తున ప్రచారం చేపట్టాడు.

దీని ప్రచారానికే అతను మైనారిటీ కార్పోరేషన్ నుంచి కొల్లగొట్టిన ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని వార్తలు వచ్చాయి. తద్వారా బ్యాంకుల నుంచి వంద కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవాలని కూడా అతను వ్యూహం రచించాడని మీడియా కథనాల సారాంశం. వన్ కార్డు వన్ నేషన్ విధానాన్ని కనీసం 300 కోట్ల రూపాయలకు విక్రయించాలని కూడా ఎత్తు వేశాడట.

ఆ రకంగా వచ్చిన డబ్బుల నుంచి ఎఫ్‌డిల ద్వారా కొల్లగొట్టిన 55 కోట్ల రూపాయలు చెల్లించేసి, మిగతా డబ్బుతో వ్యాపారాలు చేయాలని సాయికుమార్ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. వన్ కార్డ్ వన్ నేషన్ విధానాన్ని అమ్మడానికి అతను కొన్ని సంస్థలతో బేరసారాలు కూడా ప్రారంభించాడని చెబుతు్నారు. ఈ కుంభకోణం బయటపడకపోతే సాయికుమార్‌ను పట్టుకోవడం కష్టంగానే ఉండేదని అంటున్నారు.

వన్ కార్డు వన్ నేషన్ డాట్ కామ్ పేరుతో ఓ వెబ్‌సైట్ కూడా ఏర్పాటైంది. దీన్ని డిఎస్ఆర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రిజిస్షర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. డిఎస్ఆర్ ల్యాబ్స్ ప్రమోటర్ ధనిరెడ్డి సుదర్శన్ రెడ్డి. మరో డైరెక్టర్ ఉపేంద్ర రాజు. దీంతో డిఎస్ఆర్ ల్యాబ్స్‌కు సాయికుమార్‌కు మధ్య గల సంబంధమేమిటనే విషయంపై కూడా సిఐడి అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

English summary
Arrested in AP Minority finance corporation scam case, Saikumar has involved Indian Cricket team former captain Sourav Ganguly in his one card - one nation scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X