కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, టిఎంసి విద్యార్థి నేతలు

మంగళవారం తన కూతురుపై సామూహిక అత్యాచారం జరిపినవారిలో తృణమూల్ కాంగ్రెసు ఛత్ర పరిషత్ (టిఎంసిపి) నేత సామ్యో మండల్ ఉన్నట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను గదిలో తీసుకుని వెళ్లి దుస్తులు విప్పేసి, మద్యం తాగించి, రేప్ చేశారు. మండల్ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి.
ఐదుగురు నిందితుల్లో సెక్యూరిటీ గార్డ్ భోల్ యాదవ్ కూడా ఉన్నాడు. మరో నలుగురు నిందితులు మండల్, అవిక్ ఘోష్, బిజయ్ సింగ్, మిథిలేష్ ఓజా పరారీలో ఉన్నారు. జార్ఖండ్‌కు చెందిన ఓజా కాలేజీ విద్యార్థి కాడు.
సంఘటనపై విచారణకు నలుగురు సభ్యులతో కమిటీని వేసినట్లు కాజీ నజ్రుల్ సెంటనరీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ తిరుపర్ణ బోస్ చెప్పారు. సంఘటనను సెల్‌ఫోన్ల ద్వారా చిత్రకరించి, ఎంఎంఎస్ క్లిప్పులు తయారు చేసినట్లు బాధితురాలి తండ్రి చెప్పాడు. బాధితురాలిని చిత్తరంజన్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.
అమ్మాయిని బర్త్ డే పార్టీకి యూనియన్ గదిలోకి ఆహ్వానించారని, మత్తు పదార్థాలు కలిపిన సాఫ్ట్ డ్రింక్స్ తాగించారని, ఆమెపై దాడి చేసిన తర్వాత సెల్‌ఫోన్లలో చిత్రీకరించారని అంటున్నారు. మండల్ తమ సభ్యుడు కాదని టిఎంసిపి స్థానిక నాయకుడు అశోక్ రుద్ర అన్నారు. నిందితులందరినీ అరెస్టు చేయాలని తాను పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications