పదవులు కొత్తకాదన్నబాబు: వైఎస్‌పై కార్యకర్త కామెంట్

Chandrababu Naidu
కర్నూలు: తనకు పదవులు కొత్త కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. బాబు చేస్తున్న మీకోసం పాదయాత్ర 14వ రోజు కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. ఆయన బసన్నబావి నుండి పాదయాత్రను ప్రారంభించారు. బెల్డోనా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారం తనకు కొత్త కాదని, అధికారం కోసం పిల్ల కాంగ్రెసు, తల్లి కాంగ్రెసు పార్టీలు పాకులాడుతున్నాయని విమర్శించారు.

టిడిపి అధికారంలోకి రాగానే రైతులకు, పేదలకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులు ఎంతగా కష్టపడుతున్నా అప్పులే మిగిలుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు 117 రోజుల పాటు పాదయాత్ర తలపెట్టానన్నారు. రైతులకు రుణమాఫీ చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

కాగా అంతకుముందు చంద్రబాబు పాదయాత్రలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలన అంటే చంద్రబాబు ఒంటి కాలిమీద లేస్తారు. ఓ కార్యకర్త వైయస్‌పై విమర్శలు చేసి చంద్రబాబును ఆకట్టుకున్నారు. వైయస్ పెద్ద అవినీతిపరుడు అని సదరు తెలుగు తమ్ముడు బాబు ఎదుట మాట్లాడుతూ నిప్పులు చెరిగారు.

ఆయన హయాంలో మొత్తం అవినీతే జరిగింది తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. అంతేకాదు యమలోకం కథ ఒకటి వినిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు చంద్రబాబు సైలెంట్‌గా వింటూ ఉండిపోవడం గమనార్హం. చంద్రబాబు పాదయాత్ర ఆదివారం అనంతపురం జిల్లాలో ముగిసింది. సాయంత్రం ఆరున్నర గంటలకు కర్నూలు జిల్లాలో ప్రవేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+