జీవవైవిధ్యం అవసరం: జయంతి, టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

జీవ వైవిద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు మనలను క్షమించదన్నారు. రాబోయే మూడు రోజుల్లో జీవ వైవిధ్య సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. భవిష్యత్ అవసరాల కోసం పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వ్యవసాయం పైనే ఆధారపడి ఉందన్నారు. జీవ వైవిధ్యం చాలా ప్రధానమైందన్నారు. రాష్ట్రంలో జీవ వైవిధ్య పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జీవ వైవిధ్యం - అభివృద్ధి మధ్య సమతౌల్యం ఉండాలన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు.
అంతకుముందు 2.30 గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్ బేగంపేట విమానాశ్రయంలో దిగారు. 2.40 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుండి బయటకు వచ్చారు. అక్కడి నుండి హెచ్ఐఐసికి బయలుదేరారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. మన్మోహన్ హెలికాప్టర్‌లో బయలుదేరి సదస్సుకు వెళ్లారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసులు టిడిపి ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications