గుల్బార్గా వద్ద రైలు బోగీల్లో మంటలు: ఇద్దరు మృతి

రైలుకు మంటలు ఎలా అంటుకున్నాయనే విషయం తెలియడం లేదు. గుల్బార్గాలో ఆగిన తర్వాత మంగళవారం ఒంటి గంటన్నర ప్రాంతంలో రైలుకు మంటలు అంటుకున్నాయి. అగ్నికీలలు వ్యాపించడం ప్రారంభించాయి. రైలులో పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే విషయం కూడా తేలడం లేదు.
పోలీసులు, ఫైరింజన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లు మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. బోగీల్లో ఎంత మంది ఉన్నారనే విషయం తేలడం లేదు. వివరాలు అందాల్సి ఉంది. హైదరాబాద్ - షోలాపూర్ రైలు ఆగి ఉన్న పట్టాల మీదుగా ఇతర రైళ్ల రాకపోకలను నిలిపేశారు.












Click it and Unblock the Notifications