హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షర్మిల, చంద్రబాబులకు కోదండరామ్ అల్టిమేటమ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వైయస్ షర్మిలకు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అల్టిమేటమ్ ఇచ్చారు. తెలంగాణపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే వారు తెలంగాణకు రావాలని ఆయన అన్నారు. తెలంగాణపై స్పష్టత ఇవ్వని పార్టీలను నిలదీసే హక్కు తెలంగాణ ప్రజలకు ఉందని చెప్పారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించిన తర్వాత ఎవరైనా యాత్రలు చేసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఆయన గురువారం ప్రసంగించారు.

నవంబర్ 1వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా పాటించాలని, అవతరణ ఉత్సవాలని బహిష్కరించాలని తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో తెలంగాణ మంత్రులు పాల్గొనకూడదని సూచించింది. తెలంగాణవాదులపై ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయించే బాధ్యత తెలంగాణ మంత్రులపై పెడుతూ సమావేశం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ఏ విద్యాసంస్థ కూడా తమ విద్యార్థులను రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు పంపకూడదని కోదండరామ్ కోరారు.

తెలంగాణ కోసం మంత్రులు పర్యటనలు చేయడం ఎవరికి వారే అన్నట్లుగా ఉందని, ఉత్తుత్తి పర్యటనల వల్ల ప్రయోజనం ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. కేంద్రాన్ని తెలంగాణ కోసం ఒప్పించాలని లేదా రాజీనామా చేసి తెలంగాణ కోసం మంత్రులు ఉద్యమిస్తే ప్రజలు విశ్వసిస్తారని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు ముందుగా ఐక్యత పెంచుకోవాలని ఆయన సూచించారు.

తెలంగాణ మంత్రులు ఉత్తుత్తి ఢిల్లీ పర్యటనలు చేయవద్దని తెలంగాణ నగారా సమితి శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ మంత్రులు ఢిల్లీలోనే ఉండాలని ఆయన సూచించారు. ప్రత్యేక రాష్ట్రం రాకపోతే రాజీనామా చేసి రావాలని అన్నారు. కె. జానారెడ్డితో పాటు కొద్ది మంది తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో హరీష్ రావు, నాగం ఆ వ్యాఖ్యలు చేశారు.

English summary
Telangana political JAC chairman Kodandaram has given ultimatum to YSR Congress party president YS Jagan's sister Sharmila and Telugudesam president N Chandrababu Naidu, who have taken up padayatras.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X