షర్మిల టార్గెట్ చంద్రబాబే: విశ్వాసం పెడతారమో..

Sharmila
అనంతపురం: తన పాదయాత్రలో వైయస్సార్ కాంగరెసు పార్టీ నాయకురాలు షర్మిల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడినే ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం పడిపోతుందని చంద్రబాబు భయపడుతున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం పడిపోకుండా విశ్వాసత తీర్మానం ప్రతిపాదిస్తారేమోనని ఆమె వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ అంటే ఆ రెండు పార్టీలకు భయమని, జగన్ ప్రజల మధ్య ఉంటే మనుగడ ఉండదనే కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సీబీఐని వాడుకొని జగన్‌ను జైల్లో పెట్టించాయని వైఎస్ షర్మిల అన్నారు.

మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా అనంతపురం జిల్లాలోని ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో ఆరో రోజు ఆదివారం 10 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించారు. ఉదయం 10.15 గంటలకు చిగిచెర్ల నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర రాత్రి 7.30 గంటలకు ఆకుతోటపల్లి వద్ద ముగించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ విజయలక్ష్మి, షర్మిల మాట్లాడారు. ఆద్యంతం పాలకుల వైఫల్యాలు, చంద్రబాబుపై విమర్శలతోనే వారి ప్రసంగం సాగింది.

వైయస్ రాజశేఖర్‌రెడ్డి రెక్కల కష్టం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. నిలదీయాల్సిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తోందని దుయ్యబట్టారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వైయస్ అధికారం చేపట్టిన తర్వాత బాధిత కుటుంబాలన్నింటినీ పరిహారంతో ఆదుకున్నారన్నారు.

ప్రజాప్రస్థానం సమయంలో ఆయన దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలన్నింటినీ వైయస్ రాజశేఖర రెడ్డి తమతో పంచుకునే వారని వైయస్ విజయలక్ష్మి, షర్మిల చెప్పుకొచ్చారు. తన పాలనలో గ్రామాలను స్మశానాలుగా మార్చిన చంద్రబాబు ఆ గ్రామాలకు పాదయాత్ర పేరుతో వెళ్లి క్షమాపణ అడిగినా పాపం పోదన్నారు. తగిన శాసనసభ్యుల బలం ఉన్నా చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని దించేయడం లేదని షర్మిల అన్నారు.

ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అడిగితే చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో ఎగతాళి చేశారని అన్నారు. అప్పుడు గ్రామాలను స్మశానాలుగా మార్చి, ఇప్పుడు ఆ గ్రామాల వెంట పాదయాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

సాక్షులను కాదు, ప్రజలను ప్రభావితం చేస్తాడనే జగన్‌ను జైల్లో పెట్టించారని వైయస్ విజయమ్మ ఆరోపించారు. ఉప ఎన్నికలు రాగానే విచారణ పేరుతో జగన్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆమె అన్నారు. జగన్‌ను బందీ చేసి ఐదు నెలలు అవుతోందని, జగన్ బయటకు వస్తాడని అనుకున్న ప్రతిసారీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేసి బెయిల్ రాకుండా ప్రభావితం చేస్తున్నాయని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+