వాయుగుండం: నెల్లూరు జిల్లాలో బీభత్సం

Deppression in bay of Bengal
నెల్లూరు: నైరుతి బంగళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నెల్లూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది తమిళనాడు రాజధాని చెన్నైకి ఆగ్నేయంగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని చెన్నై వాతావరణ పరిశోధనా కేంద్రం తెలిపింది. చెన్నై - కడలూరు మధ్య ఈ నెల 31 తేదీ రాత్రి లోపు తీరం దాటే అవకాశం ఉంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని అల్లూరు మండలంలో వాయుగుండం బీభత్సం సృష్టించింది. నెల్లూరు జిల్లా వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతంలో గల 12 మండలాలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలను అప్రమత్తం చేసి, తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

గాలుల తాకిడికి అల్లూరు మండలంలోని తుఫాను పునరావాస కేంద్రం భవనం కూలింది. ఉద్యోగులకు సెలవులు ఇవ్వబోమని కలెక్టర్ చెప్పారు. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. జాలర్లు సముద్రంలోకి వెళ్లడం లేదు. తీరం వెంట ఉన్న పడవలను, మరబోట్లను దూరంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

నిజానికి, ఆదివారం రాత్రి నుంచే వాతావరణం మారిపోయింది. విశాఖపట్నం ఓడరేవులో మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను ప్రభావం మనదేశంలోనే తమిళనాడుపై, శ్రీలంకపై తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+