మరో ఛాన్స్ కొట్టేసిన ఎపి: పనబాక లక్ష్మికి ప్రమోషన్!

ఇప్పటికే చేనేత, జౌళీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న పనబాక లక్ష్మికి కేంద్రం ప్రమోషన్ ఇచ్చింది. ఆమెను పెట్రోలియం శాఖకు మార్చింది. లాల్ చంత్ కఠారియాను గ్రామీణాభివృద్ధి శాఖకు, మిలంద్ దేవరాను ఐటి కమ్యూనికేషన్స్‌కు మార్చింది. మానవవనరుల శాఖ మంత్రిగా పళ్లం రాజు ఈ రోజు 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పనబాక లక్ష్మికి ప్రమోషన్ ఇవ్వక పోవడంపై విమర్శలు వచ్చాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సమస్యల కారణంగానే కేంద్రం రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినందుకు ఓ వైపు ఆనందం వెల్లువెత్తినా మరోవైపు పునర్వ్యవస్థీకరణ తీరుపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. పలువురు సీనియర్ ఎంపీలు అసంతృప్తికి గురయ్యారు.
గుంటూరు, ఏలూరు ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, కావూరి సాంబశివ రావు వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కావూరి రాజీనామా చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. వారిని అధిష్టానం కూల్ చేసే ప్రయత్నాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications