శాండి: అంధకారంలో అమెరికన్స్, 45కి చేరినమృతులు

Natural Disaster: Superstorm Sandy wreaks havoc, kills 45
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను వణికిస్తున్న శాండీ తుఫాను ఇప్పటి వరకు 45 మందిని పొట్టన బెట్టుకుంది. వాల్ స్ట్రీట్ తదితర వ్యాపార కేంద్రాలు రెండో రోజు కూడా మూతపడినాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాలులు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. శాండి ప్రభావిత రాష్ట్రాల్లో ప్రభుత్వం సహాయక చర్యలను తీవ్రతరం చేసింది.

ప్రధాన విమానాశ్రయాలను మూసివేసారు. దాదాపు పదిహేనువేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండో రోజు కూడా మూతపడింది. భారతీయులు అధికంగా ఉండే న్యూజెర్సీ కూడా శాండితో ప్రభావితమైంది. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం నగర వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు. సహాయక సిబ్బంది కృషి కారణంగానే మరింత ప్రాణనష్టాన్ని నివారించామని తెలిపారు. కాగా శాండి ప్రభావంతో 70 లక్షల మందికి పైగా విద్యుత్ లేక చీకట్లో ఉంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+