తుఫాను బాధితుల వద్దకు ఆ ముగ్గురు: సందడిగా పోర్ట్

ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని తుఫాను బాధిత ప్రాంతాలలో పర్యటిస్తారు. చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో, వైయస్ విజయమ్మ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. నేతల రాక కోసం గన్నవరం విమానాశ్రయం వద్దకు ఆయా పార్టీల నేతలు చేరుకుంటున్నారు. తుఫాను బాధిత ప్రాంతాలను సందర్శించనున్న నేపథ్యంలో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ఈ రోజు రద్దయింది.
కాగా నీలం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు 27 మంది తుఫాను కారంగా మృతి చెందారు. విశాఖ జిల్లాలోని వరాహ, శారద, తాండవ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ లేక అంధకారంలో ఉండిపోయారు. పలు ప్రాంతాల్లో భోజనం లేక, కనీసం తాగడానికి మంచినీరు లేక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శ్రీకాకుళంలో నెల్లిగడ్డ వాగు పొంగిపొర్లుతుంది. విజయనగరం జిల్లాలో పదికి పైగా చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. పంట నీట మునిగింది. చంపావతి నదికి వరద పోటెత్తింది. నీలం తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతుండగా అత్యధికంగా గారలో 21.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications