కెసిఆర్‌కు నాగం జనార్దన్ షాక్: బిజెపి వైపు అడుగులు

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇవ్వడానికే తెలంగామ నగారా సమితి శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. తాను తెరాసలో చేరబోనని పరోక్షంగా చెప్పారు. కాంగ్రెసుతో కలిసిపోయే పార్టీలో తాను చేరబోనని ఆయన తెరాసలో చేరడం లేదనే విషయాన్ని చెప్పారు. పైగా, ఎన్డీయె తెలంగాణ ఇస్తుందని నమ్ముతున్నానని చెప్పారు. తద్వారా బిజెపి వైపు ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలిసిపోతోంది.

తనకు కావాల్సింది పార్టీ కాదని, తెలంగాణ అని ఆయన అన్నారు. బిజెపి నాయకులు తనతో సమావేశమైన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు శత్రువు కాంగ్రెసు పార్టీయేనని, కాంగ్రెసును బొంద పెడితేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచి ఉంటే ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ ప్రజల మనోభావాలు అర్థమై ఉండేవని ఆయన అన్నారు.

బిజెపిలో కూడా తాను చోరడం లేదని ఆయన చెప్పారు. తెలంగాణ సాధన కోసం బిజెపి సహా అని పక్షాలతో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా భరోసా యాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ భరోసా యాత్రకు బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

నాగం జనార్దన్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించలేదని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ జెఎసిలో తమ పార్టీ కొనసాగుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెసు మోసాలను బయటపెట్టే శక్తులు కలిసి రావాలని ఆయన అన్నారు. నాగం జనార్దన్ రెడ్డితో తెలంగాణ కోసం కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం తాము అందరితో కలిసి పనిచేస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+