కిరణే ఉండాలని టి-ఎమ్మెల్యేలు: తెలంగాణ కోసమే.. కెకె

ముఖ్యమంత్రి చేపడుతున్న ఇందిర బాట కార్యక్రమం కాంగ్రెసు పార్టీకి దోహదపడుతోందని, అభివృద్ధి చేయడంతో పాటు, కాంగ్రెసు పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఉపయోగపడుతోందని చెప్పారట. ఇలాంటి సమయంలో కిరణ్‌ను మార్చవద్దని విజ్ఞప్తి చేశారట. అయితే తాము తెలంగాణ తప్ప అధిష్టానం వద్ద మరో మాట మాట్లాడలేదని ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఎమ్మెల్యే ప్రతాప్ మాట్లాడుతూ... కిరణ పాలన హర్షణీయమని, ఇందిర బాటతో అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారన్నారు.
తెలంగాణ కోసమే కెసిఆర్‌తో చర్చలు
తెలంగాణ రాష్ట్రం కోసమే తమ పార్టీ ఢిల్లీ పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవరావు వేరుగా అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, మేం అందుకోసమే కృషి చేస్తున్నామని చెప్పారు.
తనకు ఏ పదవి పైనా ఆశ లేదన్నారు. తాము కోరుకునేది, తెచ్చుకునేది, సాధించుకునేది తెలంగాణ మాత్రమే అన్నారు. తెలంగాణ తెచ్చేందుకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు. తన జీవితం ప్రజల కోసం, తెలంగాణ కోసమే అంకితమన్నారు. తమకు తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయం అవసరం లేదన్నారు. ప్యాకేజీలు ఇలాంటివి తమకు అవసరం లేదన్నారు.
ఎవరి దారి వారిదే.. గుత్తా
కేంద్రం తెలంగాణ ఇవ్వకపోతే ఎవరిదారి వారిదే అని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం నల్గొండలో తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా ఆ ప్రాంత వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ప్రభుత్వం పడిపోయం ఖాయమన్నారు. తెలంగాణ ఇస్తే పదవులు అవసరం లేదని గుత్తా సుఖేందర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications