కాంగ్రెసు తీరు: టార్గెట్ షర్మిల కాదు, చంద్రబాబే...

ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి షర్మిల ప్రధానంగా మారారు. షర్మిలపై విమర్శలు చేస్తే అధిక ప్రాధాన్యం ఇచ్చి, ప్రజల్లో ఆమె మరింతగా నానుతారని, దానివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని కాంగ్రెసు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆమెపై నోరు విప్పకుండా కాంగ్రెసు నాయకులు చంద్రబాబుపై విమర్సలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తనను సవాల్ చేస్తూ తన పార్టీ గెలిచిన స్థానాలను కొల్లగొట్టడంతో పాటు, తన పార్టీ ఎమ్మల్యేలను ఆకర్షిస్తోన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మీద దాడి చేయవలసిన కాంగ్రెస్ దాన్ని విస్మరించి, తెలుగుదేశం పార్టీపై బాణాలు సంధిస్తోంది. వైయస్ జగన్ పార్టీని ఎవరు ఎదుర్కోవాలనే స్పష్టత కూడా కాంగ్రెసు పార్టీ ఇవ్వడం లేదు. గతంలో తాము జగన్‌ను ఎక్కువ విమర్శించడం వల్లే ఆయనకు మితిమీరిన ప్రాధాన్యం ఏర్పడిందన్న భావనలో ఉంది. అందుకే ఇప్పుడు షర్మిల ఎన్ని విమర్శలు చేసినా దానిపెై ఏ మాత్రం స్పందించకుండా మౌనంగా ఉంటోంది.
షర్మిల చేసే ప్రతి ఒక్క విమర్శకూ స్పందిస్తే ఆమెకు తామే ప్రాధాన్యం ఇచ్చినట్టవుతుందన్న అంచనాతో అసలు ఆమెను పట్టించుకోకూడదని నిర్ణయించింది. టీడీపీ-జగన్ పార్టీ మధ్య యుద్ధం జరిగితే అది తమకే మంచిదన్న అంచనాతో ఉంది. అందుకే కాంగ్రెస్, జగన్ పార్టీని పట్టించుకోకుండా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా పెట్టుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. షర్మిల పాదయాత్రపై మాట్లాడాల్సిన అవసరం లేదని కాంగ్రెసు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అడపా దడపా మాత్రమే వైయస్ విజయమ్మ, షర్మిల ఆరోపణలను ఖండిస్తున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా మంత్రులంతా చంద్రబాబు ఇస్తున్న హామీలపెైనే దృష్టి సారించి విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పాదయాత్రలో ఇస్తున్న హామీలపెైనే దృష్టి పెట్టి, వాటిని తిప్పికొట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ విధంగా తమకు ప్రధాన శత్రువు తెలుగుదేశం పార్టీయే తప్ప జగన్ పార్టీ కాదన్న సంకేతాలు పంపుతోంది. అయితే, జగన్ పార్టీ తమను పుట్టి ముంచుతుందన్న భయాందోళనే ఎక్కువగా కనిపిస్తోంది.
అటు జగన్ పార్టీ కూడా దాదాపు కొంచెం అటు ఇటుగా ఇలాంటి వ్యూహంతోనే వెళుతోంది. కాంగ్రెస్ పార్టీని కాకుండా కేవలం ప్రభుత్వంపెైనే విమర్శలు సంధిస్తోంది. గతంలో సోనియా అల్లుడు రాబర్ట్‌వధేరా అవినీతి సంపాదన వెలుగుచూసినప్పటికీ దానిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నోరు విప్పలేదు. తాజాగా రాహుల్-సోనియా కుటుంబంపెై సుబ్రహ్మణ్యస్వామి అవినీతి ఆరోపణలు చేస్తున్నా దానిపై కూడా స్పందించకుండా, కనీసం సీబీఐ విచారణకు డిమాండ్ చేయకుండా వమౌనవ్రతం పాటిస్తోంది. ప్రస్తుతం
రానున్న ఎన్నికల్లో తమకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు రెండూ ప్రత్యర్ధులేనన్న అంచనాతోవెళుతు న్నప్పటికీ, ప్రధానంగా జగన్ పార్టీనే లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి పదునుపడుతోంది. జెైలులో ఉన్న జగన్ తనపై చేస్తున్న మానసిక యుద్ధానికి విరుగుడుగా.. టీడీపీ కూడా ఆయనకు నిబంధనలకు విరుద్ధంగా సౌకర్యాలు కల్పిస్తోందంటూ మానసిక ప్రతిదాడికి దిగుతోంది. దానిద్వారా జగన్ దారులు మూయాలన్న లక్ష్యంతో వెళుతోంది.












Click it and Unblock the Notifications