చంద్రబాబు వద్దకూ 'దేనికైనా రెడీ' పంచాయతీ!

బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేనికైనా రెడీ చిత్రం ఉందని, దానిపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని వారు చంద్రబాబును కోరారు. దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణులను కించపర్చారని, ఇలాంటివి జరగకుండా చూడాలని వారు కోరారు. రాష్ట్రంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా అందరికీ రాజకీయంగా తమకు అవకాశాలు కల్పించాలని, బ్రాహ్మణులకు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.
కాగా చంద్రబాబు తన పాదయాత్రలో వైయస్ పాలనపై మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం కావడానికి వైయస్ రాజశేఖర రెడ్డి పాలనే కారణమని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపినిచ్చారు. పేదలకు న్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని, అందుకే పాదయాత్ర చేపట్టానని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మల్లపురం గేట్ వద్ద చంద్రబాబు నాయుడు ప్రజల నుద్దేశించి మాట్లాడారు.
తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకుండా నిరుద్యోగభృతి కల్పిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని విమర్శించారు. రైతుల రుణమాఫీ ఎలా చేస్తానో చెప్పను, చేసి చూపిస్తానని అన్నారు. తమ పార్టీ పేదల పక్షంగా నిలబడి పోరుడుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూరారం వద్ద ఎమ్మార్పీఎస్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న బాబు వర్గీకరణ దిశగా తమ పార్టీ నిర్ణయం వెలువరిస్తుందని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications