వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీనియర్లు లోకసభకు, రాహుల్‌గాంధీ గజినీ: యనమల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: పార్టీ ఆదేశిస్తే సీనియర్ నేతలం అందరం లోకసభకు పోటీ చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం అన్నారు. బిసి డిక్లరేషన్ ప్రకారం వచ్చే ఎన్నికల్లో తాము ఆ సామాజిక వర్గానికి తప్పకుండా వంద సీట్లు ఇస్తామన్నారు. పార్టీ ఆదేశిస్తే సీనియర్ నేతలు అందరూ లోకసభకు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని యనమల చెప్పారు.

లోకసభకు ఎవరెవరిని పంపాలనే దానిపై పార్టీలో ఇప్పటి నుండే కసరత్తు జరుగుతోందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల పైన కూడా పార్టీ దృష్టి సారించిందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నలభై శాతం టిక్కెట్లు యువతకు కేటాయిస్తామని ఆయన చెప్పారు. అలాగే వంద సీట్లు బిసిలకు ఇస్తామన్నారు. మైనార్టీలకు, ఇతర వర్గాలకు కూడా టిక్కెట్లు ఇచ్చే విషయంలో ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు.

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ గజినీ మహ్మద్ అని విమర్శించారు. రాహుల్ చరిత్ర అంతా ఓటమే అన్నారు. రాహుల్ నేతృత్వంలో వెళ్లినా కాంగ్రెసుకు ఒరిగేదేమీ లేదన్నారు. గ్యాస్ ధర పెంపు, ఎన్నికల ప్రధానం ఎజెండాగా రేపు పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని చెప్పారు.

మరోవైపు పల్లె పల్లెకు టిడిపిపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో ఓ వైపు పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళుతుండగా ఆ స్థాయిలో ఆయా నియోజకవర్గాల నేతల నుండి స్పందన రావడం లేదనే భావనతో ఆయన ఉన్నారట. జోరుగా పల్లె పల్లెకు టిడిపి బాటను చేయాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారట.

English summary
Telugudesam Party senior leader Yanamala Ramakrishnudu said that party senior leaders are ready to contest as MPs in next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X