వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబూ! క్లారిటీ ఇవ్వండి: మైసురా రెడ్డి డిమాండ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mysura Reddy
హైదరాబాద్: అవిశ్వాసం ప్రతిపాదిస్తారా, లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత డాక్టర్ ఎంవి మైసురా రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. అవిశ్వాసంపై డొంక తిరుగుడు సమాధానాలు వద్దని, చెప్పేది నేరుగా, స్పష్టంగా చెప్పాలని ఆయన అన్నారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని చంద్రబాబు తన పాదయాత్రలో ప్రతి చోటా చెబుతున్నారని, అటువంటప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. అవిశ్వాసంపై ఒంకరిటింకరి మాటలు, అయోమయ ప్రకటనలు చేయవద్దని అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి శాసనసభా సమావేశాలు జరగడం లేదని చంద్రబాబు అన్నారని ఆయన గుర్తు చేస్తూ అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించే విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

తమకు సంఖ్యా బలం ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఉండేవాళ్లమని, బలప్రదర్శనకూ అవిశ్వాసానికీ మధ్య తేడా ఉందని మైసురా రెడ్డి అన్నారు. ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇటువంటి సందర్భంలో గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా అవిశ్వాసం ప్రతిపాదించడానికి తెలుగుదేశం ఎందుకు ముందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు.

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా చెబుతోందని, తమ పార్టీ కూడా మద్దతు తెలుపుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోయాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. తాము ప్రజల నుంచే అధికారం పొందుతామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే ధైర్యం లేకనే చంద్రబాబు డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నేరుగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని మైసురా రెడ్డి డిమాండ్ చేశారు.

English summary
YSR Congress party leader Dr MV Mysura Reddy demanded Chandrababu give clarity on the proposal of no confidence motion on CM Kiran kumar Reddy government. He said that Chandrababu's words are not clear on this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X