యుపిఎ సర్కార్‌పై మమతా బెనర్డీ అవిశ్వాసం

దేశ కోసం యుపిఎ ప్రభుత్వం పడిపోవాల్సిన అవసరం ఉందని మమతా బెనర్డీ అన్నారు. మైనారిటీ యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తమ పార్లమెమంటరీ పార్టీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆమె చెప్పారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి.
తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆమె ప్రతిపక్షాలను కోరారు. యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం నుంచి తృణమూల్ కాంగ్రెసు తప్పుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకున్న మమతా బెనర్జీ యుపిఎ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.
రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల అనుమతిపై ఆమె కాంగ్రెసు మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇంధన ధరల పెంపుపై కూడా ఆమె ధ్వజమెత్తారు. పైగా, పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకోవడానికి మమతా బెనర్జీ సాధ్యమైనంత త్వరగా ఎన్నికలను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో ఆమె యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడానికి ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications