హంద్రీనీవాను ప్రారంభించిన కిరణ్: మొదట 2 జిల్లాలకే

తదుపరు దశల్లో మిగిలిన జిల్లాలకు నీరు అందనుంది. హంద్రీనీవా దేశంలోనే తొలి అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా గుర్తింపు పొందింది. ఇది అత్యాధునిక పరిజ్ఞానంతో కట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టు తొలిదశ పూర్తయి ప్రారంభం కావడంతో రాయలసీమవాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
120 గ్రామాలకు తాగునీరు అందుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి దీనిని కర్నూలు జిల్లా మల్యాల వద్ద ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు రూ.2,774 కోట్లతో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు రఘువీరా రెడ్డి, టిజి వెంకటేష్, కొండ్రు మురళి, శాసనమండలి చైర్మన్ చక్రపాణిలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications