అమెరికా ప్రమాదంలో ఆంధ్ర మహిళా టెక్కీ మృతి

Andhra techie dies in USA accident
విజయవాడ: అమెరికాలో ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా టెక్కీ మృత్యువాత పడింది. కాలిఫోర్నియాలోని సన్నీవేల్ నగంరోలి జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గొర్ల లలిత అలియాస్ మాగంటి లలిత (32) దుర్మరణం పాలైంది. ఆమె భర్త వీరాంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరాంజనేయులు కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఎరిక్సన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డాడు.

లలిత, వీరాంజనేయులుకు మధ్య 11 సంవత్సరాల క్రితం వివాహం కాగా, శశి (10), భువనేష్ (5) ఇద్దరు కుమారులు ఉన్నారు. భువనేష్ ఏలూరులోని అమ్మమ్మ ఇంటి వద్ద, శశి మాత్రం అమెరికాలోనే తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. కారులో వెళ్తున్న లలిత, ఆమె భర్త ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్రలైటు పడి ఆగిపోయారు. వెనక నుంచి వచ్చిన వాహనం వీరి కారును ఢీకొట్టింది. లలిత అక్కడికక్కడే మరణించింది. వారితో పాటు కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ మూర్తి స్వల్పంగా గాయపడ్డాడు.

లలిత మృతదేహాన్ని శుక్రవారం భారతదేశానికి తరలించనున్నారు. లలిత పుట్టినిల్లు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు. కాకినాడ జెఎన్‌టియులో ఎంటెక్ పూర్తి చేసింది. పెస్లా మోటార్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. వీరాంజనేయులు స్టాన్‌ఫోర్టులోని వ్యాలీ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అతను కోమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, రాజమండ్రి నుంచి వెళ్లి మిషిగన్‌లోని ఫార్మింగ్టన్‌లో ఉంటున్న తిరుమలశెట్టి సత్యప్రకాష్ (34) గుండెపోటుతో మరణించాడు. ఆయనకు భార్య మాధురి, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. మరోవైపు ఇల్లినాయిస్ రాష్టంలోని షికాగోలో ఉంటున్న వరంగల్‌కు చెందిన శ్రీరెడ్డి సృజనా రెడ్డి (28) అనారోగ్యంతో మరణించింది. ఆమె తల్లిదండ్రులు ప్రస్తుతం ఆమె వద్దనే ఉన్నారు. సృజన మృతదేహాన్ని అమెరికాలోనే ఖననం చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+