గుర్తుపడ్తారా: కిషోర్ చంద్రదేవ్‌పై నిప్పులు చెరిగిన దానం

ఆ రెండు పదవులు ముళ్ల కిరీటాలలాంటివన్న సంగతి పార్టీ నేతలు గుర్తిస్తే మంచిదన్నారు. కొందరు నేతలకు గాంధీ భవనం తెలియదని, వారు వచ్చిన సందర్భాలు లేవన్నారు. కిషోర్ చంద్రదేవ్ వంటి నేతలు గాంధీ భవనంకు వస్తే ఎవరూ గుర్తు పట్టరని విమర్శించారు. అలాంటి వాళ్లు కిరణ్, బొత్సలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కిషోర్ చంద్రదేవ్ లాంటి నేతలు కేవలం ఢిల్లీకే పరిమితం అవుతారని, రాష్ట్రం గురించి, స్థానిక ప్రజల గురించి అతనికి ఆలోచన లేదని మండిపడ్డారు. సొంత లాభం కోసం పార్టీ పెద్దలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. గాంధీ భవన్ అంటే తెలియని నేతలు పార్టీలో 90 శాతం మంది ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications