పయ్యావుల కంటనీరు: అస్కార్ అర్హుడన్న జగన్ పార్టీ

పార్టీలోని నేతలు తమ పార్టీలోకి రాకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే ప్యాకేజీలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను పశువులతో పోల్చడం సరికాదన్నారు. పయ్యావుల ఏడ్చి చెప్పారని, ఆయనను చంద్రబాబు భయబ్రాంతులకు గురి చేశారా చెప్పాలన్నారు. పయ్యావుల ఏడ్చి చెప్పి బాగా నటించారని, ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చునని చెప్పారు.
పయ్యావుల కేశవ్ ఎందుకు ఏడ్చాడో తెలియదన్నారు. తాము తమ పార్టీలో చేరాలని ఎవరినీ బలవంతపెట్టడంలేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే పయ్యావుల తమ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగిందని, అప్పుడు ఆయన మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఇప్పుడు కూడా చేరడంలేదని చెబితే సరిపోయేదని, దానికి ఏడవడం ఎందుకని ప్రశ్నించారు.
స్వర్గీయ ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. వారిని ఎంత పెట్టి కొన్నారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications