గోప్యంగా అజ్మల్‌కసబ్‌కు ఉరి: 5నే రాష్ట్రపతి తిరస్కరణ

 Ajmal Kasab
న్యూఢిల్లీ/పూణే: ముంబయి మారణ హోమం నిందితుడు అజ్మల్ కసబ్ ఉరిశిక్షను ప్రభుత్వం గోప్యంగా అమలు పరిచింది. పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పూణేలోని యెరవాడ జైలులో బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు ఉరి తీసిన విషయం తెలిసిందే. ఆయన ఉరిని గోప్యంగా ఉంచారు. ప్రహసనం పూర్తయ్యాకే అంతా బయటకు వచ్చింది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ నుండి ఉరి వరకు అంతా గోప్యంగా జరిగినట్లుగా కనిపిస్తోంది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకే ఇలా చేశారని చెప్పవచ్చు.

అజ్మల్ కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల(నవంబర్)5నే తిరస్కరించారు. కానీ దానిని అది ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. అతనిని రెండు రోజుల క్రితమే అంటే సోమవారమే ముంబయి జైలు నుండి పూణే ఎరవాడ జైలుకు తరలించారు. అక్కడ గోప్యంగా ఈ రోజు ఉదయం ఉరి తీశారు.

కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేసినట్లు మహారాష్ట్ర హోంమంత్రి ఆర్ ఆర్ పాటిల్, కేంద్రహోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలు ధ్రవీకరించారు. 2008 నవంబర్ 26న కసబ్ సహా పదకొండు మంది ముంబయిలో మారణ హోమం సృష్టించారు. మిగతా ఉగ్రవాదాలు చనిపోగా కసబ్ ఒక్కరే సజీవంగా పట్టుబడ్డాడు. 2010 మే 3న దేశంపై కసబ్ యుద్ధం ప్రకటించినట్లుగా, హత్య కేసు నమోదైంది. బాంబై హైకోర్టు అతనికి ఉరిశిక్షను అమలు పర్చింది.

2011 అక్టోబర్ 11న కసబ్‌కు బాంబే హైకోర్టు ఉరిశిక్ష విధించింది. 2012 ఆగస్టులో సుప్రీం కోర్టు దానిని సమర్థించింది. ఆ తర్వాత రాష్ట్రపతి అతని క్షమాభిక్షను నవంబర్ 5న తిరస్కరించారు. దీంతో అతనికి ఈ రోజు ఉరి శిక్షను అమలుపర్చారు. కాగా కసబ్ కుటుంబ సభ్యులకు ఉరి విషయాన్ని తెలియజేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+