కేజ్రీవాల్ పార్టీ పేరు ఆమ్ ఆద్మీ: నో హైకమాండ్

"నేను ఆమ్ ఆద్మీని. నేను స్వరాజ్ తెస్తాను. నేను లోక్‌పాల్ బిల్లు రూపొందిస్తాను" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ నెల 26వ తేదీ సోమవారంనాడు తనతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కలవాలని ఆయన ప్రజలను కోరారు. దయచేసి, 26న రావాలని, ఆ రోజు సభ్యులుగా చేరే వారంతా పార్టీ వ్యవస్థాపక సభ్యులవుతారని ఆయన అన్నారు.
కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ తదితరులు సమావేశమై పార్టీ పేరును, పార్టీ గుర్తును ఖరారు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడి సామాన్యుడి చేతిలో ప్రజాస్వామ్య శక్తిని పెడతామని కేజ్రీవాల్ అన్నారు.
పార్టీలో మహిళలకు, యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పార్టీకి అధిష్టానమంటూ ఏదీ ఉండదు. ఒక కుటుంబ ఆధిపత్యం పార్టీపై ఉండదు. అంతర్గత లోక్‌పాల్ ఉంటుంది. నిర్మాణంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. అత్యంత ప్రగతిశీలమైన భారత రాజ్యాంగ స్ఫూర్తితో పార్టీ పనిచేస్తుంది.
పార్టీని నడిపించడానికి జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. 30 మందితో జాతీయ కార్యవర్గం ఉంటుంది. పార్టీ కోసం ప్రత్యేక నిబంధనావళిని రూపొందిస్తారు. ప్రజలు నేతలతో విసిగిపోయినందున పార్టీలో నేతలెవరూ ఉండరు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications