బలహీనపడుతాం: పల్లంరాజు, చచ్చేది మేమే: గుత్తా

సెంటిమెంట్‌ను గౌరవిస్తామని, కానీ దానికి ఒక పరిష్కారం కావాలని, అది సక్రమంగా ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కాంగ్రెస్ తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ పలు రాష్ట్రాలలో కూడా ఉందని, దేశంలోని పరిస్థితులను సమతుల్యం చేస్తూ సరియైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
రాష్ట్ర విభజనపై స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఏ నాయకుడైనా ఎటువంటి డిమాండ్ చేసినా తప్పులేదని ఆయన చెప్పారు. తెలంగాణను కేంద్రం విస్మరించలేదన్నారు. తెలంగాణ ఎంపీల డిసెంబర్ 9 డెడ్‌లైన్‌పై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. దీనిపై ప్రభుత్వం, పార్టీ దృష్టి సారిస్తుందని అన్నారు.
ఇదిలావుంటే, "తెలంగాణ ఇచ్చేది మేమే..తెచ్చేది మేమే.. ఇవ్వకపోతే చచ్చేదీ మేమే'' అని నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై సంపూర్ణ విశ్వాసం ఉన్నదని అన్నారు.
ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా రెండు రోజులుగా పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించామని, విప్‌ను కూడా ధిక్కరించామని చెప్పారు. పార్టీ తెలంగాణలో చావకుండా ఉండాలంటే తక్షణమే తెలంగాణాపై ప్రకటన చేయాలని, ఈ ప్రాంత ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలని కోరారు. ఏపార్టీలోనూ తాము చేరబోమని చెప్పారు. తెలంగాణా ఇ్వకపోతే తెలంగాణవాదులందరం కూర్చుని ఏమి చేయాలో నిర్ణయించు కుంటామని పేర్కొన్నాచెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications