Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కిరణ్‌ని తూర్పారబట్టిన పెద్దిరెడ్డి: జగన్‌వైపు నో కామెంట్

Peddireddy Ramachandra Reddy-Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గానికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గురువారం ఉదయం అన్నారు. ఆయన స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు రాజీనామాను సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కిరణ్ పైన ధ్వజమెత్తారు. సమర్థుడు కాని వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారన్నారని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను తొమ్మిదేళ్లు డిసిసి అధ్యక్షుడిగా పని చేశానన్నారు. తన పని తీరుపై జిల్లా నుండి రిపోర్ట్ తెప్పించుకోవచ్చునని అన్నారు. 33 ఏళ్లుగా కాంగ్రెసు పార్టీలో కొనసాగుతున్నానని, అసమర్థ కిరణ్ కారణంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయడం లేదన్నారు.

కిరణ్ స్పీకర్ నుండి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనకు మంత్రిగా పని చేసిన అనుభవం లేదని, అలాంటి వ్యక్తి సమర్థవంతంగా ఎలా పని చేయగలడని ప్రశ్నించారు. పార్టీ కోసం పని చేయని వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేశారన్నారు. తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం తనను మనస్తాపానికి గురి చేసిందన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

కాంగ్రెసు కిరణ్ సొంత పార్టీ కాదని, తన నియోజకవర్గానికి చివరకు మంచి నీటిని కూడా అడ్డుకుంటున్నారన్నారు. భవిష్యత్తుపై తాను చెప్పాల్సిందేమీ లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతారా అంటే జ్యోష్యం చెప్పలేనని, ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేనన్నారు. అయితే తనకు పార్టీ మారాలనే ఆలోచన మాత్రం ప్రస్తుతానికి లేదన్నారు. జగన్ పార్టీలోకి వెళ్తారని మీరు ఊహించుకుంటే తానేమీ చేయలేనన్నారు.

తనతో పాటు మరో నలుగురు రాజీనామా చేయడం లేదని, ప్రస్తుతానికి తాను ఒక్కడినే చేస్తున్నానని చెప్పారు. తెలంగాణ, సమైక్యవాదం అంటూ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన సమయంలో కిరణ్ పదే పదే ఢిల్లీకి తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడని మండిపడ్డారు. 2014 వరకు కిరణ్ కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి అధోగతే అన్నారు. సిఎం కిరణ్ కిషోర్ రాజ్యాంగేతర శక్తిగా ఉన్నాడన్నారు.

ప్రభుత్వ ఖజానాకు కిరణ్ గండి కొడుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపలేని అసమర్థుడు ముఖ్యమంత్రి అన్నారు. నియోజకవర్గ పునర్విభజన తర్వాత నుండి తనపై కుట్ర చేస్తున్నాడని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి పెద్దిరెడ్డి ఆరుపేజీల లేఖ రాశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+