బాధ్యత నాదే: ఒప్పుకున్న చిరు, మజ్లిస్‌పై బొత్స ఫైర్

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడంపై బాధ్యత తనదే అన్నారు. సభ విరామం సమయంలో విలేకరులు అడగటం వల్లనే తాను కాసేపు మాట్లాడానని చిరంజీవి వివరణ ఇచ్చుకున్నారు. కాగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికా బిల్లు క్రెడిట్ దక్కించుకోవాలని చిరు, మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడ్డారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అదేవిధంగా సిఎల్పీలో సమావేశాలు జరుగుతున్న సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ తప్పు పట్టింది. సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ఆవరణలో మీడియాను అనుమతించకుండా స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. చిరంజీవి కోసం ఆంక్షలు ఉల్లంఘించాలనే వార్తలు వచ్చాయి. దీంతో ఆ ఉల్లంఘన బాధ్యత తనదే అని చిరంజీవి ఈ రోజు చెప్పారు. కాగా దీనిపై వైయస్సార్ కాంగ్రెసు స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
అక్బరుద్దీన్ పైన బొత్స మండిపాటు
కాంగ్రెసును తెగనాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని అసెంబ్లీలో కీర్తించిన మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ పైన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌లు ఇచ్చారని వైయస్‌ను పొగుడుతూ... బయ్యారం, బాక్సైట్ గనులు కాంగ్రెసు కేటాయించిందని అక్బరుద్దీన్ విమర్శించడమేమిటని బొత్స ప్రశ్నించారు.
మంచి అయితే వైయస్‌కు, చెడు అయితే కాంగ్రెసుకు అంటగడతారా అని ప్రశ్నించారు. మంచైనా చెడైనా రెండింటికి తామే బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అయినా బయ్యారం గనుల కేటాయింపు అయినా తమ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అన్నారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications